28 బ్రాంచీలు.. రూ.30 కోట్లు వసూలు ! | - | Sakshi
Sakshi News home page

28 బ్రాంచీలు.. రూ.30 కోట్లు వసూలు !

Dec 15 2025 10:24 AM | Updated on Dec 15 2025 10:24 AM

28 బ్

28 బ్రాంచీలు.. రూ.30 కోట్లు వసూలు !

28 బ్రాంచీలు.. రూ.30 కోట్లు వసూలు !

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ బాధితులు

ఎక్కువ మొత్తం డిపాజిట్‌ చేసిన వారికే బ్రాంచ్‌ల నిర్వహణ బాధ్యతలు

గుట్టుగా పెట్టుబడులు తరలించి బోర్డు తిప్పేసిన నిర్వాహకులు

తిరువూరు: ౖలెఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌ అడ్వయిజరీ సర్వీసెస్‌ పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా శాఖలు ఏర్పాటు చేసిన నిర్వాహకులు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. ఆకర్షణీయమైన బ్రోచర్లు, అధిక వడ్డీల పేరుతో ప్రజలకు నమ్మకం కలిగించి 2023 నుంచి పెట్టుబడులు స్వీకరించిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌ సంస్థకు చైర్మన్‌గా ఎన్‌ఎస్‌ఎన్‌ దుర్గాప్రసాద్‌, సీఈఓగా ఆయన భార్య శివానీ వ్యవహరించారు. ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా నమ్మకస్తులైన ఐదుగురిని నియమించుకున్నారు. ఎన్టీఆర్‌, కృష్ణా, తూర్పు గోదావరి, కాకినాడ, ఏలూరు, శ్రీకాకుళం, విజయనగరం, ఖమ్మం, సూర్యాపేట, కొత్తగూడెం, వరంగల్‌ పట్టణాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 28 బ్రాంచ్‌లు ఏర్పాటుచేసి రూ.30 కోట్లకు పైగా వసూలు చేశారు. తాము 200కు పైగా ప్రాజెక్టుల ద్వారా లాభాలను అందిస్తామని కస్టమర్లను నమ్మించారు. ఎన్టీఆర్‌ జిల్లా విస్సన్నపేటలో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసి ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష మొదలుకుని రూ.10 లక్షల వరకు డిపాజిట్లు స్వీకరించారు. మొక్కలు పెంచే ఆలోచన ఉన్నవారే తమ సంస్థలో పెట్టుబడులు పెట్టాలంటూ బ్రోచర్లలో నిబంధనలు వల్లెవేశారు. పోస్టాఫీసులు, బ్యాంకుల కంటే అధిక మొత్తంలో వడ్డీ వస్తుందనే ఆశతో చిన్న, మధ్య తరహా కుటుంబాలు ఎక్కువగా ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. మొదట్లో కొంత డబ్బు కస్టమర్లకు చెల్లించినా, నిర్వాహకులు క్రమంగా పెద్ద మొత్తంలో డబ్బులు దారి మళ్లించినట్లు ప్రచారం జరుగుతోంది.

ఏజెంట్లపై కస్టమర్ల ఒత్తిడి

తాము లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌ సంస్థలో పెట్టిన పెట్టుబడులు తిరిగి ఇవ్వాలంటూ ఏజెంట్లపై ఇన్వెస్టర్లు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. సంస్థ గురించి తమకు తెలియకపోయినా పరిచయస్తులైన ఏజెంట్లకు డబ్బు చెల్లించామని, వారి హామీపైనే పెట్టుబడి పెట్టామని పలువురు చెబుతున్నారు. ఇన్వెస్టర్ల ఒత్తిడి తట్టుకోలేక శని, ఆదివారాల్లో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌, కొత్తగూడెం తదితర పట్టణాల నుంచి ఏజెంట్లు విస్సన్నపేటకు వచ్చి దుర్గాప్రసాద్‌, శివానీ ఆస్తులపై ఆరా తీశారు.

శివానీ అదృశ్యంపై ఫిర్యాదు

దుర్గాప్రసాద్‌, శివానీది ప్రేమ వివాహం. వారిద్దరి కులాలు వేర్వేరు. దుర్గాప్రసాద్‌ స్వస్థలం కృష్ణా జిల్లా మచిలీపట్నం. శివానీ స్వగ్రామం ఎన్టీఆర్‌ జిల్లా రెడ్డిగూడెం మండలం మొద్దులపర్వ. డిపాజిట్‌దారులు, ఏజెంట్ల ఒత్తిడి తట్టుకోలేక దుర్గాప్రసాద్‌ అక్టోబరు 27న ఆత్మహత్య చేసుకున్నాడు. 10 రోజుల కిందట శివానీ తన ఇద్దరు కుమార్తెలతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కానీ, ఏజెంట్లు, కస్టమర్లు ఆందోళన చేస్తుండటంతో అనూహ్యంగా శివానీ కనిపించట్లేదని ఆమె తండ్రి గోవింద్‌ ఆదివారం రెడ్డిగూడెం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

28 బ్రాంచీలు.. రూ.30 కోట్లు వసూలు ! 1
1/1

28 బ్రాంచీలు.. రూ.30 కోట్లు వసూలు !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement