బైపాస్‌రోడ్డులో బైక్ దగ్ధం
కంకిపాడు: కంకిపాడు బైపాస్ రోడ్డు మార్గంలో బైక్ దగ్ధమైన సంఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...పటమటకు చెందిన అయ్యప్ప మాలధారి బైక్‌పై ఉయ్యూరు నుంచి విజయవాడ వైపు వస్తుండగా మార్గ మధ్యంలో కంకిపాడు బైపాస్ మార్గంలో బైక్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన బైక్ యజమాని ఒక్కసారిగా బైక్ స్టాండు వేసి బైక్ దిగటంతో వాహనదారుడికి ఎలాంటి గాయాలు కాలేదు. పెట్రోలు లీక్ అయి బ్యాటరీపై పడటంతో మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. ప్రమాదంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ సందీప్ తెలిపారు.


