బీటీఏ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
మచిలీపట్నంటౌన్: బహుజన టీచర్స్ అసోసియేషన్ (బీటీఏ) –అమరావతి సంఘ కృష్ణా జిల్లా శాఖ నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక బైపాస్ రోడ్‌లోని బహుజన టీచర్స్ అసోసియేషన్ –అమరావతి సంఘ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా ప్రధాన కార్యదర్శి లంకపల్లి రామచంద్రరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు చేబ్రోలు శరత్‌చంద్ర మాట్లడుతూ ఉపాధ్యాయులకు రావలసిన డీఏలు, సంపాదిత సెలవు బకాయిలను తక్షణం విడుదల చేయాలని, పీఆర్‌సీ కమిషన్‌ను నియమించి 30 శాతం ఐఆర్‌ను వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం నూతనంగా ఎన్నికై న ఆ సంఘ జిల్లా శాఖ కార్యవర్గసభ్యులు జిల్లా విద్యా శాఖాధికారిగా ఇటీవల బాధ్యతలను చేపట్టిన యూవీ సుబ్బారావును మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
బీటీఏ జిల్లా నూతన కార్యవర్గం ఇదే:
బీటీఏ సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడిగా ప్రత్రిపాటి జలంధర్, గౌరవ సలహాదారుగా ఎల్.రామచంద్రరావు, అధ్యక్షుడిగా మన్నెం పవన్ కుమార్ (కేపీటీ పాలెం, బందరు మండలం), ప్రధాన కార్యదర్శిగా తేరా దైవకాంత్ (ఫిషర్మెన్ కాలనీ, బందరు మండలం), అసోసియేట్ అధ్యక్షుడిగా కందిమళ్ల శ్రీనివాసరావు, అదనపు ప్రధాన కార్యదర్శిగా బట్టా రవికుమార్, కోశాధికారిగా ఆబూతురబ్ అలీ, ఉపాధ్యక్షులుగా సైకం వెంకట్రావు, కె.గోపాలం, కార్యదర్శులుగా దోమతోటి ప్రభాకర్, కొనకళ్ల వెంకటేశ్వరరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికై న కార్యవర్గ సభ్యులు జిల్లాలో సంఘ నిర్మాణానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.


