‘వేగ’లో పండుగల ఆఫర్లు
లబ్బీపేట(విజయవాడతూర్పు):రానున్న ధనుర్మాసం, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని వేగ జ్యూయలర్స్‌లో ప్రత్యేక ఆఫర్లు ప్రవేశ పెట్టారు. ఈ నెల 15 నుంచి అందుబాటు లోకి రానున్న ఈ ఆఫర్ల బ్రోచర్‌ను శనివారం విజయవాడ బృందావన కాలనీలోని నందమూరి రోడ్డులో ఉన్న వేగ షోరూమ్‌లో మిరాయ్ సినిమా ఫేమ్ రితిక నాయక్ లాంఛనంగా ఆవిష్కరించారు. ఆఫర్లలో భాగంగా బంగారు ఆభరణాల తరుగులో 50 శాతం తగ్గింపు, పోల్కి ఆభరణాల తయారీ, తరుగు చార్జీలు ఉండవని షోరూమ్ నిర్వాహకులు తెలిపారు. వజ్రాభరణాల క్యారట్ ధర కేవలం రూ.49,999 ఉంటుందని, అందరూ ఈ అద్భుతమైన ఆఫర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మైలవరం: ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్‌ను ట్రాక్టర్ ఢీకొని, అదుపు తప్పి పార్కింగ్ ప్రదేశంలో ఉంచిన ద్విచక్ర వాహనాల పైకి దూసుకు వెళ్లడంతో 9 ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం మండలంలోని పొందుగల గ్రామం నుంచి మైలవరం ఏఎంసీకి ధాన్యం లోడుతో ట్రాక్టర్ వెళుతోంది. ఈ క్రమంలో విజయవాడ వైపు నుంచి మైలవరం వస్తున్న ఆర్టీసీ బస్‌ను స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల వద్ద ట్రాక్టర్ ఢీకొని అదుపు తప్పి ఎల్బీఆర్‌సీఈ విద్యార్థులు పార్కింగ్ చేసిన వాహనాల పైకి దూసుకువెళ్లింది. దీంతో పార్కింగ్‌లోని 9 వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆర్టీసీ బస్ పాక్షికంగా దెబ్బతింది. ఆ సమయంలో ఆర్టీసీ బస్‌లో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. లకిరెడ్డి బాలిరెడ్డి కళాశాల విద్యార్థి బాణావత్ మోనిక్ నాయక్‌కి గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థిని మైలవరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. ఈ ప్రమాదానికి కారణం ట్రాక్టర్ డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడమేనని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
కృష్ణలంక(విజయవాడతూర్పు): రద్దీ ప్రదేశాల్లో ఏమరుపాటుగా ఉన్న ప్రయాణికుల నుంచి సెల్‌ఫోన్స్ దొంగిలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.3లక్షల విలువైన 11 ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నామని కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ జె.భానుప్రసాద్ తెలిపారు. విజయవాడ బస్టాండ్‌లోని పోలీస్ ఔట్‌పోస్టులో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన క్రైమ్ ఎస్‌ఐ గిరిధర్‌బాబుతో కలిసి నిందితులను ప్రవేశపెట్టి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. గుంటుపల్లి ప్రాంతంలో నివసిస్తున్న షేక్ రియాజ్, చిట్టినగర్ వాగు సెంటర్‌కు చెందిన ములకా అర్జునసాయి, ఇబ్రహీపట్నంకు చెందిన ఒక బాల నేరస్తుడు స్నేహితులు. వీరు ముగ్గురూ కలిసి సెల్‌ఫోన్లు దొంగతనం చేసి వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేద్దామని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో రద్దీ ప్రదేశాల్లో తిరుగుతూ ఆదమరిచి ఉన్న ప్రయాణికుల నుంచి మొబైల్స్ దొంగతనానికి పాల్పడుతున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదులు అందడంతో సీపీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ కృష్ణకాంత్ పాటిల్ సూచనలతో ఏసీపీ పావన్‌కుమార్ పర్యవేక్షణలో సీఐ నాగరాజు తన సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి స్టేషన్ పరిధిలోని బస్టాండ్, పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అనుమానితులు, పాత నేరస్తుల కదలికలపై పటిష్ట నిఘా పెట్టారు. ఈ క్రమంలో దొంగిలించిన మొబైల్స్‌ను అమ్ముదామని ఎన్‌టీఆర్ కాంప్లెక్స్ వద్ద వెళ్లి అనుమానంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి రూ.3లక్షల విలువైన 11 మొబైల్స్, ఒక మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో కానిస్టేబుళ్లు విజయసారథి నాయక్, రాజేష్, నాగుల్‌మీరా, సాయి తదితరులు పాల్గొన్నారు.
‘వేగ’లో పండుగల ఆఫర్లు
‘వేగ’లో పండుగల ఆఫర్లు


