కోటి సంతకాలకు విశేష స్పందన
కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు 3,24,100 సంతకాల సేకరణ
పెడన: నూతన వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తూ చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయంపై ప్రజలు తమ సంతకాల రూపంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి పెద్ద విశేష స్పందన లభిస్తోంది. సోమవారం సాయంత్రానికి జిల్లాలో 3,24,100 మంది ప్రజలు సంతకాలు చేశారు. గన్నవరం నియోజకవర్గంలోని ఎనికేపాడు, నందమూరు గ్రామాల్లోను, పామర్రు మండలంలో పామర్రు, పమిడిముక్కల మండలం మామిళ్లపల్లి గ్రామాల్లో, మచిలీపట్నం నగరంలో ముమ్మరంగా కోటి సంతకాలు సేకరణ చేపట్టారు. అలాగే అవనిగడ్డ నియోజకవర్గంలోని నాగాయలంక మండలం ఏటిమొగ, అవనిగడ్డలో సంతకాల సేకరణ నిర్వహించారు. అవనిగడ్డలో జరిగిన సంతకాల సేకరణలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఏడు నియోజకవర్గాల్లో పెనమలూరు 49,500, మచిలీపట్నంలో 65,000, గన్నవరంలో 43,000, పెడనలో 43,000, అవనిగడ్డలో 50,000, గుడివాడలో 30,500, పామర్రులో 43,100 సంతకాలను సేకరించారు.


