ఉదమ్యంలా కోటి సంతకాల సేకరణ
పెడన: నూతన వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి పెద్ద విశేష మద్దతు లభిస్తోంది. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోనూ ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేసి ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో 60వేల సంతకాలు సేకరించాలని పార్టీ లక్ష్యంగా నిర్దేశించుకోగా.. ఆదివారం సాయంత్రానికి జిల్లాలో మొత్తం 3,06,500 మంది ప్రజలు సంతకాలు చేశారు. నియోజకవర్గాల వారీగా ఇప్పటి వరకూ సేకరించిన సంతకాలు పరిశీలిస్తే.. పెనమలూరులో 49,500, మచిలీపట్నంలో 64,000, గన్నవరంలో 42,000, పెడనలో 43,000, అవనిగడ్డలో 35,000, గుడివాడలో 30,000, పామర్రులో 43,000 సంతకాలు నమోదయ్యాయి.
కృష్ణాజిల్లాలో ఇప్పటి వరకు
3,06,500 సంతకాలు


