బెజవాడలో వారాహి శిల్క్స్‌ షోరూమ్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

బెజవాడలో వారాహి శిల్క్స్‌ షోరూమ్‌ ప్రారంభం

Dec 5 2025 6:58 AM | Updated on Dec 5 2025 6:58 AM

బెజవాడలో వారాహి శిల్క్స్‌ షోరూమ్‌ ప్రారంభం

బెజవాడలో వారాహి శిల్క్స్‌ షోరూమ్‌ ప్రారంభం

లబ్బీపేట(విజయవాడతూర్పు): దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద వస్త్ర నందనం వారాహి శిల్క్స్‌ ఐదవ షోరూమ్‌ విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులో ఏర్పాటైంది. ఈ షోరూమ్‌ను గురువారం సినీ హీరో తేజ సజ్జా, హీరోయిన్‌ మీనాక్షి చౌదరి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో వారాహి సిల్క్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్లు మణిదీప్‌ యేచూరి, డాక్టర్‌ స్పందన మద్దుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ వస్త్ర ప్రపంచంలోకి అడుగు పెట్టడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. రానున్న క్రిస్మస్‌, న్యూ ఇయర్‌, సంక్రాంతి, వివాహాది వేడుకలకు కావాల్సిన అన్ని రకాల సంప్రదాయ, ఆధునికత మేళవించిన విస్తృత శ్రేణి, విభిన్నమైన ఆకర్షణీయ వస్త్రాలు లభిస్తాయన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి రూ.10 వేలు కొనుగోలుపై బంగారు నాణెం, రూ.15 వేలు కొనుగోలుపై బంగారు, వెండి ఉచితంగా అందిస్తామన్నారు. అంతేకాక రూ.1500 ఓచర్‌ ఇస్తామని, ఈ అవకాశం ఈ నెల 4 నుంచి 14 వరకు ఉంటుందన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా లక్కీడ్రా నిర్వహించి విజేతలకు ఐఫోన్‌ బహుకరించారు. ద్వితీయ బహుమతిగా 500 గ్రాముల వెండి అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement