కొండలమ్మకు వెండి కిరీటం సమ
గుడ్లవల్లేరు: మండలంలోని వేమవరం కొండలమ్మకు వెండి కిరీటాన్ని గుడివాడ కాకర్ల వీధికి చెందిన దాత ఎన్.ఎల్.వి.నరసింహారావు సమ ర్పించారు. ఆదివారం దేవస్థాన ఈఓ ఆకుల కొండలరావుకు అందించారు. కిరీటం 264 గ్రాముల బరువుతో ఉన్నట్లు కొండలరావు తెలిపారు. దాత కుటుంబాన్ని సన్మానించి అమ్మవారి చిత్రపటంతోపాటు లడ్డూ ప్రసాదాలను అందించారు. తొలుత దాత కుటుంబం పేరిట ప్రత్యేక పూజలు చేశారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విశ్వకర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదిక జరిగింది. ఆదివారం గవర్నర్‌పేటలోని కేఎల్ రావు భవన్‌లో నిర్వహించారు. నిర్వాహకుడు ధనాలకోట శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉచిత వివాహ పరిచయవేదికలో 500 కుటుంబాలు పాల్గొని పిల్లల బయోడేటా అందజేశారన్నారు. త్వరలో విశ్వబ్రాహ్మణ వెబ్‌సైట్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. వేదికలో అట్లూరి రవీంద్రచారి, జవ్వాది కూర్మ చారి, ధర్మవరపు చంద్రమౌళి, డాక్టర్ వజ్రాల శివకుమార్, ఎదుర్వాడ బ్రహ్మం, పట్నాల హరిబాబు, అండలూరి శ్రీధర్, కడారు వెంకటేశ్వరరావు, చిప్పాడ చందు తదితరులు పాల్గొన్నారు
పెనమలూరు: కానూరు సమీపంలో ఓ కాలేజీ హాస్టల్‌లోని విద్యార్థులపై ఎలుకలు దాడి చేసి గాయపరిచిన ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థుల తల్లిదండ్రులు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం కానూరులోని ఓ కాలేజీ క్యాంపస్ హాస్టల్‌లో విద్యార్థులు చదువుతున్నారు. నాలుగు రోజుల క్రితం హాస్టల్ గదుల్లోకి ఎలుకలు చేరాయి. లోపల నిద్రపోతున్న 8 మంది విద్యార్థులను కొరికి గాయపరిచాయి. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఓ విద్యార్థి తల్లి పర్వీన్ వివరాలు తెలుపుతూ తమ ఇద్దరు పిల్లలపై ఎలుకలు దాడి చేసి గాయపరిచాయన్నారు. కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లామని ఆయన విద్యార్థులకు వైద్య చికిత్స చేయిస్తామని తెలిపారన్నారు. ఎలుకలు ఇంకా హాస్టల్ గదుల్లో తిరుగుతూ కొరుకుతున్నాయని పిల్లలు తెలిపారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై క్యాంపస్ ఇన్ చార్జి నాగభూషణాన్ని వివరణ కోరగా ఎలు కల నివారణకు చర్యలు తీసుకున్నామన్నారు. అవి రాకుండా నివారిస్తామని చెప్పారు.
కొండలమ్మకు వెండి కిరీటం సమ


