కురుమద్దాలిలో రేపు మెగా జాబ్‌మేళా
పామర్రు: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నవంబర్ 1న కురుమద్దాలి గ్రామంలోని రూరల్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్ బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ పి.నరేష్‌కుమార్ గురువారం తెలిపారు. వారు మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో జపనీస్ ఎంఎస్‌సీ–ఎన్‌ఎస్ ఇన్స్రూమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, అమెరికన్ ఎంఎన్‌సీ–కొల్గేట్ పల్మోలివ్ లిమిటెడ్, ఫాక్స్కా ఎంఎన్‌సీ, టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, పీవీఎస్ లేబోరేటరీస్ లిమిటెడ్, ఇన్నోవ్సోర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, అపోలో ఫార్మసీ, క్రైడిట్ యాక్సెస్ గ్రామీణ లిమిటెడ్, వరుణ్ గ్రూప్, శ్రీనివాస ట్రాక్టర్స్(ఎస్కార్ట్స్ లిమిటెడ్) వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని తెలిపారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, బి–ఫార్మసీ పూర్తి చేసిన 18 నుంచి 35 ఏళ్ల లోపు యువత అర్హులన్నారు. ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థులు ముందుగా హెచ్‌టీటీపీఎస్://ఎన్‌ఏఐపీయూఎన్‌వైఏఎం.ఏపీ.జీవోవీ.ఐఎన్//యూఎస్‌ఈఆర్–ఆర్‌ఈజీఐఎస్‌టీఆర్‌ఏటీఐఓఎన్ లింక్ నందు రిజిష్టర్ కావాలన్నారు. జాబ్ మేళాకు రెజ్యూమ్ లేదా బయోడేటా ఫామ్‌లతో పాటు ఆధార్, ఆధార్ లింక్ అయిన ఫోన్ నంబర్, పాన్, సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు 80743 70846, 96767 08041 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
ఇబ్రహీంపట్నం: కృష్ణానదికి వరద ప్రవాహం పెరిగినప్పటికీ ఇసుక తవ్వకాలు ఆగలేదు. కాసుల కక్కుర్తితో నదిలో నుంచి ఇసుకను ఒడ్డుకు చేర్చుతున్న పడవ నీటి ప్రవాహానికి నదిలో మునిగిపోయింది. ఈప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణహాని జరగలేదు. అదే సమయంలో వరద ప్రవాహం పరిశీలించడానికి వచ్చిన ఆర్డీవో కావూరి చైతన్య పడవ నదిలో కొట్టుకుపోయిన విషయం రెవెన్యూ సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. పడవ ప్రమాదంపై ఆరా తీశారు. నదిలో మునిగిన ఇసుక పడవ బయటకు తీయాలని ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని ఆదేశించారు. తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సీఐ చంద్రశేఖర్ పర్యవేక్షణలో పడవ వెతికేందుకు రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది మునిగిన ప్రాంతానికి సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరంలోని తుమ్మలపాలెం వద్ద నదిలో ఉన్న పడవను గుర్తించారు. బలమైన తాళ్లు కట్టి పొక్లెయిన్, జేసీబీల సహాయంతో ఇసుక పడవను ఒడ్డుకు తీశారు. నదిలో నుంచి ఇసుక తరలించేందుకు ఇసుక రేవుకు గానీ, పడవలకు గానీ ఎటువంటి అనుమతులు లేవు. పడవ యజమానిపై చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.
కురుమద్దాలిలో రేపు మెగా జాబ్‌మేళా


