ముగ్గురు పిల్లలకీ డబ్బులు పడలేదు
మాకు నలుగురు పిల్లలు. బాబు నందిగామలో ప్రైవేట్ స్కూల్‌లో చదువుతున్నాడు. అతనికి డబ్బులు పడ్డాయి. గ్రామంలోని జెడ్పీ హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న నాగకీర్తన, 9వ తరగతి చదువుతున్న అక్షయ, 6వ తరగతి చదువుతున్న అఖిల ముగ్గురికీ తల్లికి వందనం డబ్బులు పడలేదు. హెచ్‌ఎం, సచివాలయం లాగిన్‌లో ఆధార్ నంబర్లు కచ్చితంగా ఉన్నాయి. ఈకేవైసీ కూడా అయింది. –బచ్చు కవిత
తల్లికి వందనం డబ్బుల కోసం మూడు నెలలుగా తిరుగుతున్నాం. మా(లక్ష్మి) బాబు వేణుగోపాల్ పదో తరగతి చదువుతున్నాడు. గతంలో అమ్మ ఒడి డబ్బులు పడ్డాయి. ఇప్పుడు అన్నీ సక్రమంగా ఉన్నా డబ్బులు పడలేదు. మా(నవ్య) పెద్దబాబు వాసు పదో తరగతి పూర్తి చేశాడు. రెండో బాబు రామ్‌ప్రసాద్ 8వ తరగతి అయింది. వారిద్దరికీ డబ్బులు పడలేదు.
–కోనూరు లక్ష్మి , బొల్లెద్దు నవ్య
మాకు 9వ తరగతి చదువుతున్న పాప నాగదీపిక, రెండో తరగతి చదువుతున్న నాగఅశ్విన్ ఉన్నారు. హైస్కూల్‌లో చదువుతున్న నాగదీపికకు తల్లికి వందనం డబ్బులు పడలేదు. పాఠశాలలో అధికారులు తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేశారు. మా గోడు వారికి విన్నవించుకున్నాం.
–కోడి త్రివేణి
ముగ్గురు పిల్లలకీ డబ్బులు పడలేదు


