40 సూచికల్లో వృద్ధి సాధించాలి | - | Sakshi
Sakshi News home page

40 సూచికల్లో వృద్ధి సాధించాలి

Oct 24 2025 8:07 AM | Updated on Oct 24 2025 8:07 AM

40 సూచికల్లో వృద్ధి సాధించాలి

40 సూచికల్లో వృద్ధి సాధించాలి

పెనుగంచిప్రోలు:రాష్ట్రంలో 15 మండలాలను నీతి అయోగ్‌ ఆకాంక్షిత బ్లాక్‌(ఏబీపీ)లుగా గుర్తించిందని, ఉమ్మడి జిల్లాలో పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం మండలాలను గుర్తించామని కేంద్ర ప్రభారీ అధికారి, కేంద్ర జలసంఘం డైరక్టర్‌ నేలపట్ల అశోక్‌కుమార్‌ అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పెనుగంచిప్రోలు, ముండ్లపాడు గ్రామా ల్లో గురువారం ఆయన పర్యటించారు. పెనుగంచిప్రోలులో తిరుపతమ్మవారి ఆలయం వద్ద వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్న డ్వాక్రా సంఘ మహిళలను కలుసుకుని వారితో మాట్లాడారు. వ్యాపారా న్ని మరింత వృద్ధి చేసుకునేందుకు సూచనలు చేశా రు. అలాగే ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, కేవీఆర్‌ జెడ్పీ హైస్కూల్‌, అంగన్‌వాడీ కేంద్రం, ఎస్‌డబ్ల్యూయపీసీ యార్డు, పంచాయతీ కార్యాలయం, రైతు సేవా కేంద్రాలను పరిశీలించారు. హైస్కూల్‌లో వంట షెడ్‌ నిర్మాణం కోసం పాఠశాల పూర్వ విద్యార్థులను సంప్రదించాలని హెచ్‌ఎంకు తెలిపారు. ఆసుపత్రిలో వైద్యులు లేరని ఇన్‌చార్జీ వైద్యులు వస్తున్నారని, ల్యాబ్‌ టెక్నీషియన్‌ కూడా లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఎంపీపీ మార్కపూడి గాంధీ, జెడ్పీటీసీ సభ్యురాలు వూట్ల నాగమణి అధికారి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై డీఎంహెచ్‌ఓ మాచర్ల సుహాసిని మాట్లాడుతూ వైద్యుల పోస్టులు కొద్ది రోజుల్లో భర్తీ అవుతాయన్నారు. మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీతి అయోగ్‌ నిర్దేశించిన 40 సూచికల్లో జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలాల్లో వెనుకబడిన సూచికల్లో మరింత వృద్ధి సాధించటానికి అధికారులను సమాయత్తం చేయటం, మరింత వేగం పెంచటానికి పలు సూచనలు, సలహాలు ఇవ్వటానికి క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నామన్నారు. ఆస్పిరేషనల్‌ బ్లాక్‌ అధికారి (ఏబీపీ)మోహన్‌ సందీప్‌ మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల్లో ఆరోగ్య ఉపకేంద్రాలకు శాశ్వత భవనాలు లేవని గుర్తించామని వెల్లడించారు. పెనుగంచిప్రోలు, ముండ్లపాడు సర్పంచులు వేల్పుల పద్మకుమారి, గూడపాటి లావణ్య, డీపీఓ లావణ్యకుమారి, నందిగామ ఆర్డీఓ కె బాలకృష్ణ, తహసీల్దార్‌ ఎ శాంతిలక్ష్మీ, ఎంపీడీఓ జి శ్రీను, ఐసీడీఎస్‌ పీడీ రిక్సానా బేగం, పశుసంవర్ధక శాఖ జేడీ హనుమంతరావు, డీడీ మోజెస్‌, ఎంఈఓ డి రవీంద్ర, పీఆర్‌ ఏఈ సుందరరామయ్య, ఏపీఎం రమఱ, ఏపీఓ జనార్ధనరావు, వైస్‌ ఎంపీపీ గుంటుపల్లి వాసు, మండల సమాఖ్య అధ్యక్షురాలు కర్ల కోటేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభారీ అధికారి అశోక్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement