వ్యాన్‌పై పడిన విద్యుత్ తీగలు
షాక్‌కు గురై యువకుడి మృతి
కోటవురట్ల: విద్యుత్ తీగలు వ్యాన్‌పై పడిన ఘటనలో ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలివి. కృష్ణా జిల్లా ముచ్చర్ల గ్రామానికి చెందిన మొటేపల్లి గీతాకృష్ణ (22) అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలోని పందూరు శివారున ఉన్న 73 హిల్స్ లేఅవుట్‌లో పనిచేస్తున్నాడు. లేఅవుట్‌లోనే నివాసం ఉంటూ నిర్వహణ పనులు చేస్తుంటాడు. గురువారం మధ్యాహ్నం లేఅవుట్ నుంచి మినీ వ్యానును నడుపుకొంటూ పందూరు వస్తుండగా మార్గం మధ్యలో సిమెంట్ విద్యుత్ స్తంభానికి వ్యాను వెనక ఉన్న గార్డ్ రాడ్ తగులుకుని స్తంభం విరిగిపోయింది. దాంతో విద్యుత్ తీగలు వ్యాన్‌పై పడిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా వ్యాన్ అంతటికీ పాకింది. ఈ విషయాన్ని గమనించని గీతాకృష్ణ డోరు తీసి కిందికి దిగుతుండగా విద్యుత్ షాక్‌కు గురై కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు మండల కేంద్రంలోని సీహెచ్‌సీకి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. కేసు నమోదు విషయమై ఎస్‌ఐ రమేష్ వివరణ కోరగా.. మృతుని కుటుంబ సభ్యులు దూర ప్రాంతం నుంచి రావాల్సి ఉండడంతో తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని తెలిపారు.
పటమట(విజయవాడతూర్పు): విజయవాడ కమిషనరేట్ పరిధిలోని పటమటలో ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించామని పటమట సీఐ పవన్ కిషోర్ తెలిపారు. ఆటోనగర్‌లో ఉన్న నవ్య బార్ వద్ద వ్యక్తి చనిపోయి ఉన్నాడని పేర్కొన్నారు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లిన సిబ్బంది ఊరు, పేరు తెలియని సుమారు 30– 35 మధ్య వయసు గల ఒక మగ వ్యక్తి చనిపోయాడని గుర్తించామన్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించామని తెలిపారు. మృతుడి వివరాలు తెలియలేదని ఎవరైనా గుర్తిస్తే స్టేషన్ నంబరు, 0866–2542333, ఎస్‌ఐ నంబరు 9866216282 సంప్రదించాలన్నారు.
వ్యాన్‌పై పడిన విద్యుత్ తీగలు
వ్యాన్‌పై పడిన విద్యుత్ తీగలు


