బీసీ బిల్లును కూటమి అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించాలి
కల్తీ మద్యం నిందితులపై చర్యలు చేపట్టాలి
మచిలీపట్నంటౌన్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపిన విధంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం తెలపాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో శనివారం నగరంలో బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలతో శనివారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి నార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం బీసీ బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన విధంగానే ఆంధ్రప్రదేశ్ కూడా కూటమి ప్రభుత్వం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. మాది బీసీల పక్షపాత ప్రభుత్వం అని పదేపదే చెప్పే చంద్రబాబు నాయుడు మరి బీసీల బిల్లు ప్రవేశ పెట్టేందుకు తాత్సారం ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. బీసీ సంఘాల నాయకులతో చర్చలు జరిపేందుకు చంద్రబాబు ఎందుకు అవకాశం ఇవ్వటం లేదని ఆయన ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ అంశంపై ఇప్పటికే రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఆయా అంశాలపై చర్చించామన్నారు. త్వరలో జరగనున్న జనగణనతోనే కుల గణన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను అమలు చేస్తూ నిర్వహించాలని కోరారు. తెలంగాణలో నిర్వహించిన బీసీ బంద్‌కు మద్దతు తెలుపుతున్నట్లు ఆయన ప్రకటించారు.
జనగణనతో పాటే కులగణన చేపట్టాలి
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు డాక్టర్ లాకా వెంగళరావు యాదవ్ మాట్లాడుతూ.. బీసీలను ఓటు బ్యాంకుగా రాజకీయ పార్టీలు ఉపయోగించుకుంటున్నాయే తప్ప బీసీల స్థితిగతులపై ఆలోచన చేసే పార్టీలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలు దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు చేసున్నా పాలకులకు కనీసం కనికరం కూడా ఉండటం లేదన్నారు. ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు మాట్లాడుతూ.. గతంలో బ్రిటిష్ పాలకులు జనగణనతో పాటు కులగణనను కూడా చేసేవారని, కానీ స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయినా పాలకులు ఈ విధానాన్ని అమలు చేయకపోవడం విచారకరమన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రతి 10 ఏళ్లకోసారి జరిగే జనగణనతో పాటే కులగణన కూడా జరుగుతుందని అలా బీసీలకు జరగకపోవడంతో ఈ వర్గాలకు ఎంతో నష్టం కలుగుతుందని చెప్పారు. ఇకపై జాతీయ స్థాయిలో బీసీల కులగణనను కూడా చేపట్టాలని అప్పుడే రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బీసీలు బలపడతారన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కుక్కల వీర వెంకట సత్యనారాయణ, సీపీఐ నేత దోనేపూడి శంకర్, చేనేత కార్మిక సంఘం నాయకులు బండారు ఆనందప్రసాద్, అందే జగదీష్, కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ మతిన్, కొడమంచిలి చంద్రశేఖర్, సొంటి నాగరాజు, పైడిపాముల గురు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తొలుత నగరంలో డిమాండ్లతో కూడిన నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.
సీఎం చంద్రబాబు బీసీ నాయకులతో చర్చలు జరపాలి
స్థానిక సంస్థల ఎన్నికలు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లతో నిర్వహించాలి
రౌండ్ టేబుల్ సమావేశంలో
వక్తల డిమాండ్
మచిలీపట్నంటౌన్: రాష్ట్రంలో ఇటీవల వెలుగు చూసిన కల్తీ మద్యం వ్యవహారంలో బాధ్యులైన వ్యక్తులు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా నిష్పక్షపాతంగా కఠిన చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మచిలీపట్నంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా చర్యలు చేపట్టాలని కోరారు


