స్కిట్‌లు, డ్యాన్స్‌లతో వైద్యుల నిరసన
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పీహెచ్‌సీల్లోని వైద్యులు ఆందోళన బాట పట్టారు. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో వారి ఆందోళనలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేవలం దీక్షా శిబిరంలో మాత్రమే కాక, జనసమ్మర్థం అధికంగా ఉండే మాల్స్‌లో ఫ్లాష్ మాబ్‌లు నిర్వహిస్తూ తమ ఆవేదనను స్కిట్‌లు, పాటల రూపంతో ప్రజలకు వివరిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం విజయవాడ బెంజిసర్కిల్ వద్ద నున్న ట్రెండ్ సెట్‌మాల్‌లో యువ వైద్యులు వినూత్నంగా నిరసన ప్రదర్శన చేశారు.
– సాక్షి ఫొటో గ్రాఫర్, విజయవాడ
స్కిట్‌లు, డ్యాన్స్‌లతో వైద్యుల నిరసన


