
12న మట్టి పాత్రల తయారీపై వర్క్ షాప్
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): మట్టి పాత్రల తయారీపై వర్క్‌షాప్‌ను ఈ నెల 12వ తేదీ ఆదివారం తమ సెంటర్‌లో నిర్వహిస్తున్నామని ఆర్టీజో సెంటర్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ చెప్పారు. స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ఉన్న సెంటర్ ఆవరణలో వర్క్‌షాప్‌నకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ గురువారం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ మట్టితో బొమ్మలను తయారు చేసే ప్రాచీన కళకు పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (బీఎఫ్‌ఏ) డిగ్రీ పూర్తి చేసిన ప్రముఖ పోటరీ ఆర్టిస్ట్ సురేష్ ఈ వర్క్‌షాప్‌నకు ముఖ్య అతిథిగా హాజరై మట్టితో వివిధ రకాల పాత్రలు తయారుచేయడం, వాటికి అందంగా రంగులు అద్దడంపై శిక్షణ ఇస్తారన్నారు. 8 నుంచి 60 సంవత్సరాల వయస్సు లోపు వారు ఎవరైనా హాజరు కావచ్చని చెప్పారు. ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ సర్టిఫికెట్ అందజేస్తామన్నారు. వివరాలకు 99499 99222లో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు.