
13నుంచి విజయవాడలో షాపింగ్ ఫెస్టివల్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 13నుంచి 19వ తేదీ వరకు విజయవాడలో షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించనున్నామని.. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సమన్వయ శాఖల అధికారులు కృషిచేయాలని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జేసీ ఇలక్కియ.. జాయింట్ కమిషనర్(జీఎస్‌టీ) ఎస్.ప్రశాంత్ కుమార్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు చేకూరే ప్రయోజనాలపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా జీఎస్టీ తగ్గుదల ప్రభావమున్న వస్తువుల స్టాళ్లతో షాపింగ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశామన్నారు. డీఆర్‌డీఏ, యూసీడీ ద్వారా కూడా కొన్ని స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డీఈవో యూవీ సుబ్బారావు, జిల్లా పరిశ్రమల అధికారి పి.వెంకటరావు, డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు, యూసీడీ పీవో పి.వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ