
సింహాద్రికి జీవిత సాఫల్య పురస్కారం
నాగాయలంక: గత 40 ఏళ్లుగా ఫొటోగ్రాఫర్‌గా, పాత్రికేయుడిగా సామాజిక కార్యకర్తగా సేవలు అందిస్తున్న నాగాయలంకకు చెందిన సింహాద్రి కృష్ణప్రసాద్ నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ నుంచి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఆదివారం జరిగిన యూనియన్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో యూనియన్ జాతీయ అధ్యక్షుడు సురేష్‌శర్మ, ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ ఆభా నిఘమ్, ఐ అండ్ పీఆర్ ఆర్జేడీ (ఒంగోలు) టి.కస్తూరి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. స్వచ్ఛ నాగాయలంక సొసైటీలో స్వచ్ఛంద సేవా కార్యకర్తగా, అధ్యక్షుడిగా ఐదేళ్లకు పైగా ఆయన గ్రామానికి సేవలు అందించారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్‌కు అవనిగడ్డ ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్‌బాబు, అంబటి శ్రీహరిప్రసాద్ తదితరులు అభినందనలు తెలిపారు.