
జ్వర.. పంజా!
న్యూస్‌రీల్
జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులతో ఆస్పత్రులకు క్యూ ప్రభుత్వాస్పత్రిలో పెరిగిన పిడియాట్రిక్, జనరల్ మెడిసిన్ ఓపీలు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ అదే పరిస్థితి ఈ ఏడాది ఇప్పటి వరకూ 32 మలేరియా, 6 డెంగీ కేసులు నమోదు ఫీవర్ సర్వేను అటకెక్కించిన కూటమి ప్రభుత్వం
సర్వేలు లేవు.. ఫ్యామిలీ డాక్టర్ లేడు..
కృష్ణాజిల్లా
మంగళవారం శ్రీ 2 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
విష జ్వరాలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి
● రెడ్డిగూడెం మండలం రామాపురంలోని గురుకుల పాఠశాలలోని పిల్లలకు వారం రోజుల కిందట వైరల్ జ్వరాలు సోకి మంచం పట్టారు. దీంతో అక్కడ ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించాల్సి వచ్చింది.
ఇలా జిల్లాలో అనేక మంది జ్వరాల బారిన పడి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు.
విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 6వ తేదీన చలో విజయవాడ నిర్వహిస్తున్నామని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి కె.ప్రసన్నకుమార్ తెలిపారు.
● విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడుకు చెందిన మల్లేశ్వరి విజయవాడ లోని ఓ చిన్న హోటల్‌లో పనిచేస్తోంది. వారం రోజుల కిందట జ్వరం రావడంతో పాటు ప్లేట్‌లెట్స్ కూడా తగ్గాయి. దీంతో ఆమె ప్రభుత్వాస్పత్రిలో చేరి ఐదు రోజుల పాటు చికిత్స పొందింది. జ్వరంతో పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండటంతో ఆమె జీవనం కష్టతరంగా మారింది.
లబ్బీపేట(విజయవాడతూర్పు): జిల్లాలో విష జ్వరాలు విజృంభించి, ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడంతో, ఎడతెరిపి లేని వర్షాలకు తోడు పారిశుద్ధ్యం లోపించడం, దోమల స్వైర విహారంతో ప్రజలు మంచం పడుతున్నారు. ప్రధానంగా వైరల్ జ్వరాలతో ఎక్కువ మంది ఆస్పత్రులకు క్యూ కడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇంట్లో ఒకరికి తగ్గగానే మరొకరు జ్వరం బారినపడుతున్నారు. ముఖ్యంగా విజయవాడలోని సింగ్‌నగర్, ప్రకాష్‌నగర్, వాంబేకాలనీ, కొత్తపేట, కృష్ణలంక, జక్కంపూడి ప్రాంతాల్లో జ్వరాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. అలాగే ఎన్టీఆర్ జిల్లాలోని ఎ. కొండూరు, రెడ్డిగూడెం, విస్సన్నపేట, జగ్గయ్యపేట రూరల్, ఇబ్రహీంపట్నం వంటిి ప్రాంతాల్లోనూ జ్వరాలు అధికంగానే ఉన్నాయి. జ్వరంతో పాటు జలుబు, దగ్గు వంటి సమస్యలతో ఆస్పత్రులకు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అక్కడక్కడ డెంగీ లక్షణాలతో జ్వరాలు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
పెరిగిన ఓపీ..
సీజనల్ జ్వరాలు ప్రారంభం కావడంతో ప్రభుత్వాస్పత్రుల్లో ఓపీ సేవల కోసం వచ్చే వారి సంఖ్య పెరిగింది. విజయవాడలోని పెద్దాస్పత్రి జనరల్ మెడిసిన్ ఓపీ రోగులు 25శాతం పెరగ్గా, పిడియాట్రిక్ ఓపీ సైతం 30శాతం పెరిగింది. ఆ రెండు విభాగాల్లో ఐపీ రోగులు సైతం పెరుగుతున్నట్లు ఆయా విభాగాల వైద్యులు చెబుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరంతో వస్తున్నారని, రెండు, మూడు రోజుల్లో కోలుకుంటున్నట్లు వివరిస్తున్నారు. కాగా ఈ ఏడాది జిల్లాలో ఇప్పటి వరకూ అధికారిక లెక్కల ప్రకారం 32 మలేరియా పాజిటివ్ కేసులు నమోదు కాగా 6 డెంగీ కేసులు నమోదయ్యాయి. లెక్కల్లో లేని కేసులు ఇంకా రెట్టింపు సంఖ్యలో ఉండే అవకాశం ఉంది.
ప్రైవేటు కెళ్తే జేబుకు చిల్లే..
జ్వరం వచ్చి ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లిన వారు అధిక మొత్తంలో చెల్లించాల్సి వస్తోంది. కేవలం ఓపీ రోగిగా వెళ్తేనే రూ.2,500 నుంచి రూ.3,000 వరకూ బిల్లు చేస్తున్నారు. ఓపీ చార్జీలు, డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి నిర్ధారణ పరీక్షలు, సీబీపీ వంటివి చేస్తూ వేలాది రూపాయలు వసూలు చేస్తున్నాయి. ఇక ఆస్పత్రులో చేరితే రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకూ ఖర్చు చేయిస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో సరైన వసతుల్లేక పోవడంతో పేద, మధ్య తరగతి ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి అప్పులు చేసి వైద్యం పొందాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది.
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రతి పది హేను రోజులకోసారి ఫీవర్ సర్వే నిర్వహించి జ్వరాలతో బాధ పడుతున్న వారిని గుర్తించే వారు. డెంగీ, మలే రియా పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్యం అందించేవారు. ఫ్యామిలీ డాక్టర్ పేరుతో వైద్యులే గ్రామానికి వచ్చి వైద్యం చేసేవారు. ప్రస్తుతం ఫ్యామిలీ ఫిజీషియన్ వ్యవస్థ ఏడాది కిందటే మరుగున పడగా, ఫీవర్ సర్వేల మాటే వైద్యశాఖ మర్చిపోయింది. దీంతో జ్వరపీడితులను పట్టించుకునే వారే కరువయ్యారు. ప్రజలు చేసేది లేక కొంద రు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తుండగా, మరికొంద రు ప్రభుత్వాస్పత్రులకు క్యూ కడుతున్నారు.

జ్వర.. పంజా!

జ్వర.. పంజా!

జ్వర.. పంజా!

జ్వర.. పంజా!

జ్వర.. పంజా!