
అండర్–22 కృష్ణా జిల్లా హాకీ జట్ల ఎంపిక
గూడూరు:అండర్–22 బాలుర, బాలికల విభాగాలలో కృష్ణా జిల్లా హాకీ జట్ల ఎంపిక గురువారం గూడూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగింది. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారుల ఎంపిక నిర్వహించారు. హాకీ అసోసియేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్.రామకృష్ణ, కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రవణం హరికృష్ణ, సంయుక్త కార్యదర్శి యోగానంద్, ట్రెజరర్ పి.ఎస్.విఠల్, గూడూరు క్లబ్ కార్యదర్శి పెనుగొండ శ్రీనివాసరావులు, పీడీ మత్తి అరున, పీఈటీ చిలుకోటి రాజేష్‌ల పర్యవేక్షణలో బాలుర, బాలికల జట్ల ఎంపిక నిర్వహించారు. సెలక్షన్స్ ప్రక్రియను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గొరిపర్తి విజయ కుమారి ప్రారంభించారు.
జిల్లా జట్లు ఇవే....
బాలికల జట్టు: జె.వనజశ్రీ(కెప్టెన్), ఎం.యజ్ఞశ్రీ(గోల్‌కీపర్), ఎల్.రమాల్య, పి.లిల్లీ గ్రేస్, పి.సాహిత్య, ఆర్.లాలిత్య, కె.ఇంద్రజ, పి.సంజన, కె.చరిష్మ, ఎం.చేతన శ్రీ, వి.రమ్య, సిహెచ్.నాగజ్యోతి, పి.యశ్విత, ఎం.కావ్యశ్రీ, కె.లైలా, ఏ.ఝాన్సీరాణి, సిహెచ్,కీర్తన, ఎ.నాగసంజనలు ఎంపికవ్వగా స్టాండ్ గర్‌ల్స్‌గా టి.కావ్య, టి.కుసుమ భవాని, వి.మోహనాంజలిలను ఎంపిక చేశారు.
బాలుర జట్టు: ఎం.భాస్కరరావు (కెప్టెన్), వి.పవన్‌కుమార్ (గోల్‌కీపర్), ఎస్.కె.ఆర్యన్, వి.మనోజ్, జి.ఎల్.వీరబాబు, టి.తరుణ్ కుమార్, బి.శివసతీష్ బాబు, ఎస్.భరత్‌కుమార్, ఎస్.చరణ్, సిహెచ్.వెంకట సాయి, ఎష్.జస్వంత్ కుమార్, పవన్‌కళ్యాణ్, టి.ఇషాక్, వనసాయి, ఎ.రవితేజ, ఎస్‌కె.బాష, అబ్దుల్ కరీం, శ్రీనివాస్‌లు జిల్లా జట్టకు ఎంపికయ్యారు. స్టాండ్ బాయ్స్‌గా ఎం.ఎఫ్.తన్వీర్, కె.పవన్‌తేజ, జి.మహిధర్‌లను ఎంపిక చేశారు.