
మునేరు కాజ్‌వేపై ప్రమాదం
పెనుగంచిప్రోలు: స్థానిక మునేరు కాజ్‌వేపై ట్రాక్టర్, ఆటో ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలైన ఘటన గురువారం చోటు చేసుకుంది. మునేరు అవతల పొలం పనులు ముగించుకుని ట్రాక్టర్ వస్తుండగా, వెనుక అనిగండ్లపాడు వైపు నుంచి వస్తున్న ఆటో ట్రాక్టర్‌ను క్రాస్ చేస్తూ ముందుకు వెళ్తుంది. ఆ సమయంలో అదుపు తప్పి ట్రాక్టర్ ఆటోను ఢీకొని మునేరులో పడిపోగా ట్రాక్టర్ కింద వత్సవాయి మండలం దేచుపాలెం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పెరుమామిళ్లపల్లి రాజు (43) పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న గన్నవరం దగ్గర దావోజిగూడెంకు చెందిన పాలాది వెంకటేశ్వరరావు మునేరులో పడి గాయాలవ్వగా, ఆటోలో ప్రయాణిస్తున్న పెనుగంచిప్రోలుకు చెందిన బిట్ట తులశమ్మకు గాయాలయ్యాయి . వారిని 108 వాహనంలో పెనుగంచిప్రోలు ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. మృతి చెందిన రాజును పోస్టుమార్టమ్ నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాన్తు చేస్తున్నారు.
ట్రాక్టర్, ఆటో ఢీకొన్న
ఘటనలో ఒకరు మృతి
ఇద్దరికి గాయాలు

మునేరు కాజ్‌వేపై ప్రమాదం