
రైతులకు తీవ్ర నష్టం
జి.కొండూరు మండలంలోని లోయ ప్రాంతంలో ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన తొమ్మండ్రం వాగు కొండపల్లి పారిశ్రామిక వాడను ఆనుకొని కట్టుబడిపాలెం గ్రామం మీదుగా సైపన్ ద్వారా బుడమేరు డైవర్షన్ కెనాల్‌ను దాటి కవులూరు శివారులోని వ్యవసాయ భూముల మీదుగా ప్రవహించి తారకరామా ఎత్తిపోతల పథకం ఎడమ కాలువలో కలుస్తుంది. పరిశ్రమల నుంచి విడుదలవుతున్న రసాయన వ్యర్థాలు వాగులో కలిసి వ్యవసాయ భూముల మీదుగా ప్రవహిస్తోంది. దీంతో కవులూరు పరిధిలో 600 ఎకరాల సాగుబూములు చవుడుబారి రైతులు నష్టపోయారు. వ్యర్థాల నుంచి వచ్చే దుర్వాసన, ఈగలు, దోమల కారణంగా కట్టుబడిపాలెం గ్రామ ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. కలుషిత నీరు తాగిన మేకలు, గేదెలు, ఆవులు, పందులు వంటి మూగ జీవాలు పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డాయి.