
కృష్ణా జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ
యోగ సాధనతో మానసిక ప్రశాంతత
చిలకలపూడి(మచిలీపట్నం): యోగ సాధనతో మానసిక ప్రశాంతత పొందొచ్చని కృష్ణా జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్‌హాలులో బుధవారం జరిగిన యోగాంధ్ర–2025 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే యోగా కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. జూన్ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. నెల రోజుల పాటు జిల్లాలో యోగా పోటీలు, పలు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఆయుష్ శాఖ వివిధ యోగా సంఘాల సహకారంతో జిల్లాస్థాయిలోనే కాకుండా మండల, గ్రామస్థాయిలో కూడా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుందని పేర్కొన్నారు. యోగా గురువులు, శిష్య బృందంతో ప్రజలందరికీగాపై శిక్షణ ఇస్తారని వివరించారు. వేసవి సెలవులు పూర్తయిన తరువాత కళాశాలలు, పాఠశాలల్లో శిక్షణ తరగతులు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో జూన్ 21న మంగినపూడిబీచ్‌లో భారీగా యోగా కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తు న్నామన్నారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ గీతాంజలిశర్మ సహా పలువురు అధికారులు యోగ సాధన చేశారు. ఈ కార్యక్ర మంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, బందరు ఆర్డీఓ కె.స్వాతి, డీఈఓ పి.వి.జె.రామారావు, పశుసంవర్ధకశాఖ అధికారి చిననరసింహులు, మునిసిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.