
డాబాపై నుంచి పడి వృద్ధుడి మృతి
పెడన: సోమవారం రాత్రి డాబాపై నిద్రించి వర్షం పడుతోందని కిందకు దిగుతూ ప్రమాదవశాత్తు కిందపడి వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన పెడన పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వేకువ జామున జరి గింది. పెడన పోలీసుల కథనం మేరకు.. మండలంలోని కవిపురం గ్రామానికి చెందిన పుప్పాల మాణిక్యాల రావు (67) తన భార్య వీరకుమారితో కలిసి సోమవారం డాబాపై నిద్రించారు. మంగళవారం వేకువ జామున వర్షం పడుతుండ టంతో భార్యాభర్తలు కిందికి దిగుతున్న సమయంలో మాణిక్యాలరావు ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. కిందనున్న పిల్లర్లు ఊచలు మాణిక్యాలరావు ఛాతీలో బలంగా దిగబడ్డాయి. వీరకుమారి అరుపులకు ఇంట్లోని కుమారుడు, చుట్టు పక్కల వారు వచ్చి మాణిక్యాల రావును పైకి తీసి అంబులెన్సులో మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మాణిక్యాలరావు మృతిచెందాడని నిర్ధారించారు. మృతుడి చిన్నకుమారుడు బాలకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెడన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.