కృష్ణాజిల్లా | - | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా

May 21 2025 1:37 AM | Updated on May 21 2025 1:37 AM

కృష్ణ

కృష్ణాజిల్లా

బుధవారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2025

రైల్వేస్టేషన్‌లో పోలీసుల తనిఖీలు

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వేస్టేషన్‌లో జీఆర్పీ పోలీసులు మంగళవారం జాగిలాల సాయంతో విస్తృత తనిఖీలు నిర్వహించారు.

టీడీపీ దౌర్జన్యం

తిరువూరు మునిసిపల్‌ చైర్మన్‌ ఎన్నికను ఎలాగైనా అడ్డుకోవాలని కూటమి నాయకులు వైఎస్సార్‌ సీపీ నాయకులను దారి కాచి అడ్డగించారు.

భారీ వర్షం

అవనిగడ్డ: దివిసీమలోని పలు ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారు జామున కుండపోత వర్షం కురిసింది. దీంతో పలు రోడ్లు జలమయమయ్యాయి.

అధునాతన భవనాలు కట్టినా పాత ఇంటి బిల్లులు ఇంకా జనరేట్‌ అవుతున్నట్లు డీఏంఏ కార్యాలయానికి ఫిర్యాదులు చేరినట్లుగా తెలిసింది. కొత్తగా భవనాలు నిర్మించినా, మొదటి అంతస్తు వరకు పన్ను వేసి రెండు, మూడు అంతస్తులకు పన్నులు వేయకపోవడం, కాలనీలకు పన్నులు వేయకపోవడం, డాక్యూమెంట్లు సరిగ్గా లేవని పన్నులు వేయకుండా ఉండటం వంటి విషయంలో డీఎంఏ కార్యాలయం చాలా సీరియస్‌గా స్పందించినట్లు అధికారులు చెబుతున్నారు. తక్షణం ఇటువంటి వాటిని గుర్తించి 20 శాతం పన్ను వేయాల్సిందేనని స్పష్టం చేసినట్లు వివరిస్తున్నారు. కొలతలు ప్రకారం పన్ను ఉందా లేక తగ్గిందా చూడాలని, ఏమాత్రం తగ్గినట్లు అనుమానం ఉన్నా తక్షణం వాటికి పన్నులు వేయాలని పేర్కొందని చెబుతున్నారు. డీఎంఏ కార్యాలయం నుంచి వెళ్లిన బృందాలకు పలు మునిసిపాలిటీల్లో, కార్పొరేషన్లలో ఈ దుస్థితి ఎదురైందని, పలువురు అడ్మిన్లను సస్పెండ్‌ చేసినట్లు పేర్కొంటూ హెచ్చరికలు జారీ చేసిందని వివరిస్తున్నారు.

పెడన: పట్టణాలు, నగరాల్లో ఆస్తిపన్ను అసెస్‌ మెంట్లు పెరుగుతున్నా ఆదాయం పెరగకపోవడంపై పురపాలక శాఖ పరిపాలన విభాగం(డీఎంఏ) సీరి యస్‌ అయ్యింది. ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులు, టెలికాన్ఫరెన్సుల్లో ఇదే విషయాన్ని మునిసిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లోని అధికారులకు స్పష్టం చేసింది. పన్నులు వసూళ్లు చేయడంలోనే కాకుండా ఇంకా పాత రేట్లను కొనసాగిస్తున్నారంటూ మండిపడింది. ఆయా కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో అసెస్‌మెంట్లు పెరుగుతున్న స్థాయిలో ఆస్తి పన్నులు కూడా పెరగాల్సి ఉండగా.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉందని.. తక్షణం వార్డు సచివాలయాల్లో ని అడ్మిన్లు, ఇంజినీరింగ్‌, ప్లానింగ్‌ కార్యదర్శులతో పునఃపరిశీలన చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

పెడన పురపాలక సంఘ కార్యాలయం

ఆదేశాలు నిజమే..

అసెస్‌మెంట్లు పెరుగుతున్నా.. ఆదాయం పెరగడం లేదని, ఆస్తి పన్నులు పునఃపరిశీలన చేయాలని డీఎంఏ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల జరిగిన వీసీల్లోను, టీసీల్లో ఇదే విషయమై చర్చ కూడా జరిగింది. అడ్మిన్ల వ్యవస్థ వచ్చిన తర్వాత ఆస్తిపన్నులు పెంపుదలలో బాగా వెనుకబడ్డారని తెలిపింది. గతంలో బిల్‌ కలెక్టర్లు ఉన్న సమయంలో పనులు సక్రమంగా జరిగేవని, ఇప్పుడు ఎందుకు ఆస్తి పన్నులు పెంచలేదని ఉన్నతాధికారులు అడిగారు. అనుమానం ఉన్న ఇంటిని కాదు, ప్రతి ఇంటినీ క్రాస్‌ చెక్‌ చేయాలని ఆదేశించారు. ఆ దిశగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం.

– పి.వెంకటేశ్వరరావు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌,పురపాలక సంఘం, పెడన

7

న్యూస్‌రీల్‌

భవనాలు కట్టినా..

కృష్ణాజిల్లాలో పెరిగిన అసెస్‌మెంట్ల వివరాలు..

కార్పొరేషన్‌/ అసెస్‌మెంట్లు

మునిసిపాలిటీ 2023–24 2024–25 పెరిగినవి

మచిలీపట్నం 48,272 52,570 4,298

గుడివాడ 26,258 29,384 3,126

తాడిగడప 44,671 48,006 3,335

ఉయ్యూరు 9,911 10,119 208

పెడన 7,234 7,578 344

ఆస్తి పన్నుల రూపంలో ఆదాయం వచ్చే విషయంలో మీనమేషాలు లెక్కిస్తే మాత్రం శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని డీఎంఏ స్పష్టం చేసింది. డీఎంఏ కార్యాలయం నుంచి ప్రత్యేక బృందాలు ఆస్తి పన్నులపై క్రాస్‌ చెక్‌ చేస్తాయని, ఆ సమయంలో ఏమైనా పన్నులు సక్రమంగా వేయలేదని గుర్తిస్తే మాత్రం సస్పెన్షన్‌కు గురికావాల్సి ఉంటుందని కూడా హెచ్చరికలు జారీ చేసింది. దీంతో వార్డు సచివాలయాలకు చెందిన అడ్మిన్లు ఆస్తిపన్నులపై దృష్టి సారించారు. చాలా చోట్ల సిఫార్సులతోను, రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో కొన్ని ఇళ్లకు సక్రమంగా పన్నులు విధించడం లేదని విషయాలపై కూడా ఫిర్యాదులు డీఎంఏ కార్యాలయానికి వెళ్లినట్లు సమాచారం.

కృష్ణాజిల్లా1
1/7

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా2
2/7

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా3
3/7

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా4
4/7

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా5
5/7

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా6
6/7

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా7
7/7

కృష్ణాజిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement