
సేంద్రియ ఎరువులపై అవగాహన కల్పించండి
జికొండూరు: సేంద్రీయ ఎరువుల తయారీ గుంతలపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. సేంద్రీయ ఎరువుల గుంతలతో పారిశుద్ధ్యం సమస్యకు చెక్ పెట్టడంతో పాటు బహుళ ప్రయోజనాలు కలిగిన సేంద్రీయ ఎరువులు తయారు చేసుకోవచ్చని సూచించారు. జికొండూరులో సేంద్రీయ ఎరువుల (కంపోస్ట్ ఫిట్) తయారీ గుంతల తవ్వకం పనులను శనివారం ఆయన ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ కంపోస్ట్ ఫిట్‌లకు ఎటువంటి ఖర్చులు లేకుండా ఉపాధిహామీ పథకంలో చేపట్టవచ్చన్నారు. ఈ ఏడాది జిల్లాలో 17వేల గుంతలు తీసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. పారిశుద్ధ్యం, పశు వ్యర్థాలతో కంపోస్ట్ తయారు చేయవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ రాము, డీఆర్డీఏ పీడీ నాంచారరావు, డీపీవో లావణ్యకుమారి పాల్గొన్నారు.
కృష్ణానదిలో దూకి వ్యక్తి మృతి
తోట్లవల్లూరు: పేకాటశిబిరంపై పోలీసులు దాడి చేసేందుకు వస్తుండగా గమనించిన కొందరు జూదగాళ్లు తప్పించుకునే క్రమంలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ కృష్ణానదిలో పడిపోయి మృతి చెందిన ఘటన శనివారం మండలంలోని రొయ్యూరు సమీపంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ సీహెచ్ అవినాష్ ఆధ్వర్యంలో పేకాట శిబిరంపై దాడి చేసేందుకు రొయ్యూరు–మద్దూరు సమీపంలోని కృష్ణానది తీరానికి వెళ్లారు. శిబిరానికి సుమారు 400 మీటర్ల దూరంలో ఉండగానే పోలీసులను గుర్తించిన జూదరులు పారిపోయే ప్రయత్నం చేశారు. కంకిపాడు మండలం మద్దూరుకు చెందిన వల్లభనేని గోపాలరావు, ఒడుగు వెంకటేశ్వరరావు మద్దూరు వైపు పారిపోయే క్రమంలో సమీపంలోని కృష్ణానది నీటిలో దూకారు. ఈ ఘటనలో వల్లభనేని గోపాలరావు (35) మృతి చెందగా, ఒడుగు వెంకటేశ్వరరావు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. మృతుడు గోపాలరావు కుటుంబానికి న్యాయం చేయాలంటూ మద్దూరు నుంచి మృతుడి బంధువులు పెద్ద ఎత్తున పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ

సేంద్రియ ఎరువులపై అవగాహన కల్పించండి