
నూరు శాతం ఉద్యోగాల సాధన హర్షణీయం
మచిలీపట్నంరూరల్: కృష్ణా యూనివర్సిటీలో విద్యను అభ్యసించిన విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్‌లో నూరు శాతం ఉద్యోగాలు సాధించటం గొప్ప విషయం అని రాష్ట్ర ఎకై ్సజ్, భూగర్భ వనరులు, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా యూనివర్సిటీలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అకడమిక్ బ్లాక్‌లో గురువారం అచీవర్స్ డే ఘనంగా నిర్వహించారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎం.ఉష అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రూ.45 కోట్లతో విశ్వవిద్యాలయంలో సర్వ సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయిస్తామని, పల్లె తుమ్మలపాలెంలో మెగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించామన్నారు. అనంతరం జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ మాట్లాడుతూ ప్రైవేట్ రంగంలో విస్తృతంగా ఉద్యోగావకాశాలు ఉన్నాయన్నారు. విద్యార్థులు ఇంజినీరింగ్, డాక్టర్ కోర్సుల వైపు కాకుండా ఇతర రంగాలను ఎంచుకోవడం చాలా అవసరం అన్నారు. వీసీ ఆచార్య కె.రాంజీ మాట్లాడుతూ కేయూ క్యాంపస్ సెలక్షన్స్‌లో ఎంపికై న విద్యార్థులు సంవత్సరానికి తొమ్మిది లక్షల రూపాయల ప్యాకేజీ పొందటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులను, అధ్యాపకులను అభినందించారు. కార్యక్రమంలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మంత్రి ఘనంగా సత్కరించారు. విద్యార్థులకు వారి తల్లిదండ్రుల చేతులమీదుగా ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులు కొనకళ్ళ బుల్లయ్య, నెక్స్ ్ట హబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సీఈఓ సాయికృష్ణ, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ కుమారి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంబాబు, పలువురు ఆచార్యులు పాల్గొన్నారు.