ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ దర్శనానికి విచ్చేసే భక్తులకు జల ప్రసాదాన్ని అందించేందుకు దాతలు ముందుకు రావడం హర్షనీయమని దుర్గగుడి ఈఓ శీనానాయక్ పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం, భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే దుర్గాఘాట్‌లో మినరల్ వాటర్ ప్లాంట్‌లను ఈఓ శీనానాయక్ బుధవారం ప్రారంభించారు. దివీస్ ల్యాబోరేటరీస్ లిమిటెడ్ భక్తులకు రక్షిత మంచినీటిని అందించేందుకు వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సామాజిక సేవలోనే దైవత్వం ఇమిడి ఉంటుందని, భక్తులకు సేవ చేస్తే భగవంతుడికి చేసినట్లేనని ఈఓ పేర్కొన్నారు. దాతలు, సామాజిక సంస్థలు, కార్పొరేట్ సంస్థలు భక్తుల సేవలో పాలుపంచుకోవాలని కోరారు. అనంతరం ఈఓ శీనానాయక్ స్వయంగా భక్తులకు మంచినీటిని అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఈ కోటేశ్వరరావు, వైకుంఠరావు, దివీస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
20 నుంచి విద్యార్థులకు గ్రంథాలయ వర్క్‌షాప్
విజయవాడ కల్చరల్: విజయవాడ బుక్‌ఫెస్టివల్ సోసైటీ, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, తమ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు గ్రంథాలయ వర్క్‌షాప్ జరుగుతుందని గ్రంథాలయ పునర్వికాస ఉద్యమవేదిక ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ గోళ్ల నారాయణరావు తెలిపారు. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. సంస్థ కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. రోజూ ఉద యం తొమ్మిది నుంచి 11గంటల వరకు, సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు వర్క్‌షాప్ జరుగు తుందని తెలిపారు. సివిల్ కోర్టుల ఎదురుగా ఉన్న విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ కేంద్రంగా ఈ శిక్షణ జరుగుతుందని పేర్కొన్నారు.
గ్రంథాలయాల వినియోగం, తెలుగు భాషపై ఆసక్తిని పెంచడం, పుస్తక పఠనం, కథలు రాయడం, చెప్పడం, ఆటలు, మ్యాజిక్ షో, సైన్స్ సందేహాలు, చిత్రలేఖనంపై ఆయా అంశాల్లో నిపుణులు శిక్షణ ఇస్తారని వివరించారు. మరిన్ని వివరాలకు 0866 2570843, 94943 40664 ఫోన్ నంబర్లలో సంప్రదించా లని నారాయణరావు కోరారు. ఈ సందర్భంగా వర్క్ షాప్ బ్రోచర్‌ను అతిథులు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో గ్రంథాలయ ఉద్యమ సారథులు మనోహర నాయుడు, లక్ష్మయ్య, వెంకట నారాయణ, రెహమాన్, శ్రీపతిరాయ్ తదితరులు పాల్గొన్నారు.

ఘాట్‌రోడ్డు, స్నానఘాట్లలో దుర్గమ్మ జలప్రసాద కేంద్రాలు