
బరువు.. ఆధరవు
● దివిసీమ రైతుకు బిహార్ కంద సాగుతో లాభాలు ● కంద బరువు 13.50 కిలోలు
మేళ్లమర్తిలంక(మోపిదేవి): వాణిజ్య పంటలకు కృష్ణాజిల్లా దివిసీమకు చెందిన మోపిదేవి మండలానికి మంచి పేరు ఉంది. అధిక దిగుబడులు సాధించడానికి రైతులు పోటీ పడుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవల మేళ్లమర్తిలంకకు చెందిన మోర్ల వెంకటేశ్వరరావు 10 సెంట్ల మెట్ట భూమిలో బిహార్ కంద సాగు చేపట్టారు. ప్రతి కందదుంప 10 నుంచి 13 కిలోల బరువు వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. సాధారణంగా ఒక్కొక్కదుంప 3నుంచి 4 కిలోల బరువు ఉంటుంది. 10 సెంట్ల భూమిలో 4(1,000కిలోల) పుట్టల కంద దిగుబడి వచ్చిందని, మార్కెట్‌లో పుట్టెకు రూ. 15 వేల వంతున విక్రయించగా మొత్తం రూ. 60 వేలు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఖర్చులు సుమారు రూ. 7 వేలు అయినట్లు వివరించారు. అత్యధికంగా 13.50 కిలోల బరువున్న కంద దుంపను చూసి రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.