
గడువు ముగిసినా కొనసాగుతుంది
రేషన్‌కార్డులకు సంబంధించి ఈకేవైసీ గడువు ఏప్రిల్ 30తో ముగిసింది. అయినా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఏమి రాలేదు. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లబ్ధి పొందాలన్నా, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తదితర వాటికి తెల్ల రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ప్రజలు అవగాహనతో ఈకేవైసీ చేయించుకునేందుకు ముందుకు రావాలి. సభ్యులు ఈకేవైసీ చేయించుకోకపోతే నిత్యావసర సరకులు పొందడానికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంకా ఎవరైనా చేయించుకోవాల్సిన వారుంటే తక్షణం ఈకేవైసీ చేయించుకోవాలి.
–కె అనిల్‌కుమార్, ఇన్‌చార్జి తహసీల్దార్, పెడన