
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
కంచికచర్ల: హైదరాబాద్ నుంచి విజయవాడకు బైక్‌పై వస్తుండగా శనివారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్‌ఐ బి.రాజు కథనం మేరకు విజయవాడ సున్నపు బట్టీల సెంటర్‌కు చెందిన మహ్మద్ రఫీ ఉజ్ జమాన్(45) అనే వ్యక్తి హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. అతని కుటుంబ సభ్యులు విజయవాడలో నివాసం ఉంటున్నారు. రఫీ పెద్ద కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుందని భార్య ఫోన్ చేసి చెప్పింది. దీంతో రఫీ హైదరాబాద్ నుంచి బైక్‌పై విజయవాడ బయలుదేరారు. కంచికచర్ల సమీపంలోకి రాగానే ఫ్లై ఓవర్‌పై గోడకు బైక్ తగిలి కిందపడ్డాడు. తలకు తీవ్రగాయాలవటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. రఫీ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నందిగామ ప్రభుత్వాస్పపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.