
నూతన కార్యవర్గం ఎన్నిక
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏపీ ఎంప్లాయీస్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ అసోసియేషన్ ఉమ్మడి కృష్ణాజిల్లా నూతన కార్యవర్గం ఎన్నికై ంది. ఆదివారం గాంధీనగర్‌లోని హనుమంతరాయ గ్రంథాలయంలో కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అసోసియేషన్ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా కల్యాణ్ కుమార్(నూజివీడు), సెక్రటరీగా నాగ పద్మావతి(గన్నవరం), ట్రెజరర్‌గా నాగమణి(నూజివీడు), వైస్ ప్రెసిడెంట్‌గా మధుబాబు(గన్నవరం), కమిటీ సభ్యులుగా జయంతి(గుడివాడ), వందన(కృష్ణాజిల్లా), కిరణ్(ఎన్టీఆర్) ఎన్నుకున్నారు. సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ రాజు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.