
ఎన్నో ఆటంకాలను అధిగమించి
శుక్రవారం శ్రీ 2 శ్రీ మే శ్రీ 2025
అవనిగడ్డ/నాగాయలంక: గుల్లలమోద క్షిపణి పరీక్ష కేంద్రం దివిసీమ సిగలో కలికితురాయిగా మారనుంది. క్షిపణి పరీక్ష కేంద్రంతో దివిసీమ ఖ్యాతి విశ్వవ్యాప్తం కానుంది. గత 13 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టుకు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ పద్ధతిలో ప్రారం భోత్సవం చేయనున్నారు. తొలిదశలో రూ.1,600 కోట్లతో పనులు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.20 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుతో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు రావడంతో పాటు దివిసీమ పారిశ్రామికంగా, పర్యాటకంగా ఎంతో అభివృద్ధి సాధించనుంది.
అనువుగా ఉంటుందని..
ఇక్కడ సముద్రం మలుపు ఉండటం, దట్టమైన మడ అడవులు పెరగడంతో ఈ ప్రాంతాన్ని అనువైనదిగా ఎంచుకున్నారు. మచిలీపట్నం, చైన్నె ఓడరేవుల నుంచి సముద్రమార్గం ఉంది. దీంతో క్షిపణి ప్రయోగ కేంద్రాలకు అవసరమైన పరికరాలు రోడ్డు రవాణా నుంచి కాకుండా సముద్ర మార్గం నుంచి తీసుకొచ్చే వసతులు ఉన్నాయి. దీనికి తోడు 8 కి.మి. మేర ఇక్కడ జనావాసాలు లేకపోవడం, చెంతనే సముద్రం ఉండటంతో క్షిపణి పరీక్షలకు అనువుగా ఉంటుందని డీఆర్డీఓ అధికారులు నిర్ధారించడం ఈ ప్రాజెక్టుకు ప్రధానంగా కలిసొచ్చే అంశాలు.
అన్ని రంగాల్లో అభివృద్ధి
ఈ ప్రాజెక్టుకు సుమారు 300 మంది శాస్త్రవేత్తలు, మరో ఆరు వందల మంది సిబ్బంది నివాసం ఉండాల్సి రావడంతో ఈ ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందనుంది. భారీ కంటైనర్లు రాకపోకలతో రహదారుల విస్తరణ జరగనుంది.అనుబంధ పరిశ్రమలతో పలు భవనాల నిర్మాణాలు, స్థానికంగా వేలాది మందికి ఉపాధి, పచ్చదనం కోసం చెట్లు పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వడంతో పర్యావరణ సమతౌల్యం పెరుగుతుంది.
న్యూస్‌రీల్
13 ఏళ్ల నిరీక్షణ
నేడు వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని
డీఆర్డీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ క్షిపణి ప్రయోగ కేంద్రానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం వర్చువల్ పద్ధతిలో ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇక్కడ లైవ్ ప్రసారాలను తిలకించేందుకు ఈ ప్రాంతంలో భద్రతా చర్యలు, ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీటిని కలెక్టర్ బాలాజీ, ఎస్పీ గంగాధరరావు, డీఆర్డీఓ చైర్మన్ సమీర్ వి.కామత్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
డీఆర్డీఓ ఆధ్వర్యాన గుల్లలమోదలో క్షిపణి పరీక్ష కేంద్రం
నేడు వర్చువల్ పద్ధతిలో ప్రారంభోత్సవం
తొలివిడతగా రూ.1,600 కోట్లతో పనులు
మొత్తం రూ.20 వేల కోట్లతో
అభివృద్ధి పనులు
రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ)కు దేశవ్యాప్తంగా 51 పరిశోధనాలయాలు ఉన్నాయి. జాతీయ భద్రతకు సంబంధించి వైమానిక అవసరాలు, ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభి వృద్ధి, జీవశాస్త్రం, మిస్సైల్స్, యుద్ధ శకటాలు, యుద్ధనౌకలు, క్షిపణిల తయారీపై ఇక్కడ పరిశోధనలు జరుగుతాయి. ఒడిశాలోని బాలాసోర్ కంటే మెరుగైన క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేయాలని 2011లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం 2012లో కృష్ణాజిల్లా నాగాయలంక మండల పరిధిలోని గుల్లలమోద అనువైన ప్రాంతంగా పాలకులు గుర్తించారు.
2011లో బాలాసోర్ కంటే మెరుగైన పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయిం చింది. దీని ఏర్పాటుకు 2012లో గుల్లలమోద అనుకూలప్రాంతంగా గుర్తించారు. తొలుత ఈ ప్రాజెక్టు కోసం 380 ఎకరాల భూమి అవసరం అవుతుందని అంచనా వేశారు. గుల్లలమోద పరిసర ప్రాంతాల్లో క్షిపణి పరీక్ష కేంద్రానికి అనువైన భూములన్నీ అటవీ పరిధిలోకి వస్తాయి. ఈ ఆటంకాన్ని అధిగమించడానికి ఐదేళ్లు పట్టింది. 2017లో రెవెన్యూ నుంచి అటవీశాఖకు భూములు బదలాయించడానికి రూ.35 కోట్లు చెల్లించారు. అభయారణ్యం కావడంతో అరుదైన ఆలివ్‌రెడ్లీ తాబేళ్లు, బావురు పిల్లులు వంటి అంతరించి పోతున్న జీవరాసులు అక్కడ ఉండటంతో అనుమతులకు కొంత సమయం పట్టింది. డీఆర్డీఓ చైర్మన్‌గా పనిచేసిన సతీష్‌రెడ్డి తెలుగువారు కావడంతో గతంలో ఈ ప్రాజెక్టు కోసం ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

ఎన్నో ఆటంకాలను అధిగమించి

ఎన్నో ఆటంకాలను అధిగమించి

ఎన్నో ఆటంకాలను అధిగమించి

ఎన్నో ఆటంకాలను అధిగమించి