హక్కులు, చట్టాలపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

హక్కులు, చట్టాలపై అవగాహన అవసరం

May 27 2026 6:02 AM | Updated on May 27 2026 6:02 AM

వాంకిడి: బాలల హక్కులు, చట్టాలపై ప్రజల కు అవగాహన అవసరమని జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ శ్రావణ్‌ కుమార్‌ అన్నారు. మండలంలోని పాటగూడలో మంగళవారం ప్రజాపాలన– ప్రగతి ప్ర ణాళికలో భాగంగా ‘బాల్య వివాహం– బ తుకు ఆగం’ పేరిట అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలను అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బాల్య వివాహం జరుగుతున్నట్లు సమాచారం ఉంటే 1098 లేదా 112, మహిళల సమస్యలపై 181 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. అనంతరం సర్పంచ్‌ శ్రీదేవి అధ్యక్షతన బాలల హక్కుల పరిరక్షణ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ సూపర్‌వైజర్‌ దుర్గం పితాంబర్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement