వాంకిడి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు సిబ్బంది కృషి చేయాలని డీఐఈవో బి.రాందాస్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలను శుక్రవారం సందర్శించారు. సిబ్బందితో సమావేశ మై పలు సూచనలు చేశారు. విద్యార్ధుల హాజ రు శాతం పెంచేందుకు ప్రభుత్వం మధ్యా హ్న భోజనం అమలు చేస్తుందని, అలాగే వె ల్కమ్ కిట్లు మంజూరు చేస్తుందని తెలిపారు. వార్షిక పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి న విద్యార్థుల జాబితా రూపొందించి వారికి బహుమతులు ప్రదానం చేసి అభినందించా లని సూచించారు. రాష్ట్రస్థాయిలో జిల్లా మూ డో స్థానం సాధించిన నేపథ్యంలో సిబ్బంది డీఐఈవోను శాలువాతో సన్మానించారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ చంద్రయ్య, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.


