నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

Apr 18 2026 7:29 AM | Updated on Apr 18 2026 7:29 AM

చింతలమానెపల్లి: విత్తనాలు, ఫర్టిలైజర్‌ డీలర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని డీఏవో వెంకట్‌ అన్నారు. మండలంలోని బాలాజీఅనుకోడ రైతు వేదికలో శుక్రవారం మండల డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ డీలర్లు స్టాక్‌ రిజిస్టర్లు, బిల్‌ బుక్‌లు తప్పకుండా నిర్వహించాలన్నారు. విత్తనాలు, పురుగుమందులు, ఎరువుల కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని, కొనుగోళ్లకు సంబంధించిన రశీదు తప్పకుండా ఇవ్వాలని అ న్నారు. పారాక్వాట్‌ గడ్డిమందు నియంత్రణ పై నిబంధనలు, నకిలీ విత్తనాలపై అవగాహ న కల్పించారు. అనంతరం గంగాపూర్‌లోని రైతు అశోక్‌ గౌడ్‌ ఆయిల్‌పామ్‌ తోటను సందర్శించారు. అనంతరం స్థానిక రైతులతో మా ట్లాడారు. కార్యక్రమంలో మండల వ్యవసా య అధికారి కార్తీషా, రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement