21న సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ముట్టడి | - | Sakshi
Sakshi News home page

21న సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ముట్టడి

Apr 18 2026 7:29 AM | Updated on Apr 18 2026 7:29 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: ఉపాధిహామీ కూలీల సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 21న చలో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చినట్లు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్‌ ముంజం ఆనంద్‌కుమార్‌ తెలిపారు. కాగజ్‌నగర్‌ మండలం భట్టుపల్లి, ఎన్జీవోస్‌ గ్రామాల కూలీలు దరిగాం అటవీ ప్రాంతంలో చేస్తున్న పనులను శుక్రవారం పరిశీలించారు. కూలీలపై తీవ్ర ప్రభావం చూపుతున్న రెండు ఫొటోల విధానం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. వికసిత్‌ భారత్‌ జీ రామ్‌జీ పేరుతో పథకాన్ని బలహీనపర్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement