క్రికెట్ బెట్టింగ్ నిర్వహణపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశాం. ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్‌కు అలవాటు పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. పిల్లలకు అవసరం మేరకు మాత్రమే తల్లిదండ్రులు డబ్బులివ్వాలి. బెట్టింగ్‌పై పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో అవగా హన కల్పిస్తున్నాం. ప్రభుత్వం నిషేధించిన యాప్‌ల్లో బెట్టింగ్‌లకు పాల్పడుతూ పట్టుబ డితే శిక్ష తప్పదు. బెట్టింగ్, జూదం, మట్కా, గంజాయి లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా బెట్టింగ్ పెడుతున్నట్లు తెలిస్తే పోలీసులు, డయల్ 100కు సమాచారం ఇవ్వండి. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం.
– నితిక పంత్, ఎస్పీ


