కలెక్టరేట్‌ ఎదుట ఉద్యోగుల నిరసన | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ ఎదుట ఉద్యోగుల నిరసన

Apr 18 2026 7:29 AM | Updated on Apr 18 2026 7:29 AM

ఆసిఫాబాద్‌: రెండో పీఆర్సీ అమలు చేయాలని, పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం భోజన విరామ సమయంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట టీజీఈజేఏసీ నాయకులు నల్లబ్యాడ్జీలతో ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్‌ కె.హరితకు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందించారు. ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆరోగ్య కార్డులు అమలు చేయాలని, సీపీఎస్‌ రద్దు చేసి, ఓపీఎస్‌ పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆఫ్‌ తెలంగాణ ఎంప్లాయీస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఒమర్‌ హుస్సేన్‌, ఆయా సంఘాల ప్రతినిధులు రియాజ్‌ అలీ, పోచన్న, జితేందర్‌, గురువయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement