నిప్పుల గుండం | - | Sakshi
Sakshi News home page

నిప్పుల గుండం

Apr 18 2026 7:29 AM | Updated on Apr 18 2026 7:29 AM

● బెజ్జూర్‌లో 44.3 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత

కౌటాల: భానుడు భగభగ మండుతుండటంతో జిల్లా నిప్పుల గుండంగా మారింది. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల చేరువ కావడంతో ప్రజలు వేడి, ఉక్కపోత, వడగాలులకు తల్లడిల్లుతున్నారు. శుక్రవారంలో బెజ్జూర్‌లో అత్యధికంగా 44.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా, కాగజ్‌నగర్‌లో 44.3, వంకులం 44.1, రెబ్బెన 43.9, ఆసిఫాబాద్‌ 43.9, దనోరా 43.8, కెరమెరి 43.8, లోనవెల్లి 43.7, దహెగాం 43.7, సిర్పూర్‌(టి) 43.6, కౌటాలలో 43.5 డిగ్రీలుగా నమోదైంది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కౌటాల మండలం కన్నెపల్లి గ్రామంలో సర్పంచ్‌ మోర్లె పార్వతి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి సాయికృష్ణగౌడ్‌ గ్రామంలో ఎండలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందితో టామ్‌ టామ్‌ వేయించారు. ప్రజలు ఉదయం పది గంటలలోగా ఇళ్లకు చేరుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో ఎండల్లో తిరగవద్దని సూచించా రు. కాగా, పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా వాతావరణం చల్లబడి చిరుజల్లులు కురిశాయి.

Advertisement
 
Advertisement
Advertisement