నేడు నల్లబ్యాడ్జీలతో నిరసన | - | Sakshi
Sakshi News home page

నేడు నల్లబ్యాడ్జీలతో నిరసన

Apr 17 2026 10:38 AM | Updated on Apr 17 2026 10:38 AM

ఆసిఫాబాద్‌: రెండో పీఆర్సీ అమలు, పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం భోజన విరామ సమయంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఆవరణలో నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు జాయింగ్‌ యాక్షన్‌ కమిటీ ఆఫ్‌ తెలంగాణ ఎంప్లాయీస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఒమర్‌ హుస్సేన్‌ తెలిపారు. ఈ మేరకు గురువారం కలెక్టర్‌ కె.హరితకు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ ఆరోగ్య కార్డులు అమలు చేయాలని, సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. అంతకు ముందు విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా సంఘాల ప్రతినిధులు ఎటుకూరి శ్రీనివాసరావు, కాంపెల్లి ఊ షన్న, గర్రెపెల్లి కర్నాగౌడ్‌, అడె శ్రావణ్‌, అఖిల్‌, కృష్ణ, లకావంత్‌ శంకర్‌, ఉప్రే వినేశ్‌, జ్యోతి, సంధ్యారాణి, శార్వాణి, శ్రీపద తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement