కౌటాల ప్రాంతంలో కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్నారు. వీరంతా డయాలసిస్ కోసం కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది. కౌటాలతో పాటు మరో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయం. రోగుల బాధలను గుర్తించి కేంద్రాలు మంజూరు చేయించిన ఎమ్మెల్సీ దండె విఠల్‌కు కృతజ్ఞతలు. వెంటనే ఈ కేంద్రాలను ప్రారంభించి రోగులకు సేవలు అందించాలి.
– దుర్గం జానకీరావు,
కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు, కౌటాల
మెరుగైన వైద్య సేవలే లక్ష్యం
కిడ్నీ రోగులు గతంలో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌లోని డయాలసిస్ కేంద్రాల్లో బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నాం. జిల్లాలో మరో ఐదు కేంద్రాల ఏర్పాటుకు నివేదికలు పంపించాం. మంజూరు ఉత్తర్వులు అందిన వెంటనే ఆయా కేంద్రాల్లో సేవలు ప్రారంభిస్తాం. – సీతారాం, డీఎంహెచ్‌వో


