కాగజ్‌నగర్‌టౌన్: అరైవ్– అలైవ్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో గురువారం డీఎస్పీ వహీదుద్దీన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించారు. ఆటో, ట్రక్, బస్, లారీ డ్రైవర్లకు వైద్యులు కంటి పరీక్షలు చేసి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించారు. డీఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల కంటి ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సరైన చూపు లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రతీ డ్రైవర్ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రూరల్ సీఐ కుమారస్వామి, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.


