పుట్టినరోజే ప్రమాదం.. ఆస్పత్రి నుంచే ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

పుట్టినరోజే ప్రమాదం.. ఆస్పత్రి నుంచే ఫిర్యాదు

Apr 17 2026 10:38 AM | Updated on Apr 17 2026 10:38 AM

సిర్పూర్‌(టి): మండలంలోని వేంపల్లి సమీపంలో బైక్‌, టాటా ఏస్‌ వాహనం ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు బాధితుల వద్దకే వెళ్లి ఫిర్యాదు స్వీకరించారు. ఆసిఫాబాద్‌కు చెందిన నికోడె జగన్‌ పుట్టినరోజు సందర్భంగా గురువారం సిర్పూర్‌(టి) మండలంలోని టోంకిని దేవాలయానికి సోదరి శిల్పతో కలిసి బైక్‌పై వెళ్లాడు. తిరిగి వస్తుండగా వేంపల్లి సమీపంలో ప్రమాదవశాత్తు టాటాఏస్‌ ఢీకొట్టడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. ప్ర యాణికులు కాగజ్‌నగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సిర్పూర్‌(టి) ఎస్సై సాగర్‌ ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement