శిక్షణ బాగుంది | - | Sakshi
Sakshi News home page

శిక్షణ బాగుంది

Apr 17 2026 10:38 AM | Updated on Apr 17 2026 10:38 AM

పాలిసెట్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇస్తున్న ఉచితంగా శిక్షణ బాగుంది. ఉపాధ్యాయులు ప్రవేశ పరీక్షల్లో వచ్చే ముఖ్యమైన విషయాలను తేలికగా అర్థమయ్యేలా చెబుతున్నారు. ప్రతీరోజు ఉదయం 8 గంటల నుంచి తరగతులు కొనసాగుతున్నాయి.

– కొండు వర్షిణి, జెడ్పీఎస్‌ఎస్‌, భట్టుపల్లి

అర్థమయ్యేలా చెబుతున్నారు

శిక్షణలో భాగంగా ఉదయం 8 గంటలకు మధుకర్‌ సార్‌ మొదటి క్లాస్‌ తీసుకుంటున్నారు. సార్‌ వచ్చాక ముందుగా పోటీ పరీక్షలు ఏ విధంగా ప్రిపేర్‌ కావాలనే అంశాలను అర్థమయ్యేలా చెబుతారు. అలాగే సాబిర్‌ సార్‌ లెక్కలు సులువుగా వివరిస్తారు. ఒకసారి వింటే అలా గుర్తుండిపోతుంది.

– సమిరీన్‌, భట్టుపల్లి

పేద విద్యార్థులకు వరం

పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ మాలాంటి పేద విద్యార్థులకు వరం. ఇతర ప్రాంతాలకు వెళ్లి శిక్షణలో చేరాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రభుత్వ ఉపాధ్యాయులు బాధ్యతతో బోధన చేపట్టడం ఆనందంగా ఉంది.

– జిల్లా ఐశ్వర్య, అందవెల్లి

టెక్నికల్‌ కోర్సులతో ఉజ్వల భవిష్యత్తు

గ్రామీణ ప్రాంత విద్యార్థులు, తల్లిదండ్రులకు పదో తరగతి తర్వాత ఏం చేయాలనే దానిపై అవగాహన ఉండటం లేదు. కరోనా సమయంలో ఈ ప్రాంత విద్యార్థుల కోసం విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్‌ అందించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని 2023లో ప్రారంభించాం. విద్యార్థులు టెక్నికల్‌ కోర్సుల వైపు వెళ్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. – కటుకం మధుకర్‌, శిక్షణ కోఆర్డినేటర్‌, జిల్లా సైన్స్‌ అధికారి

సౌకర్యాలు కల్పిస్తున్నాం

నాలుగేళ్లుగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణ తరగతులను హాజరయ్యే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఉదయం 11.15 గంటలకు స్నాక్స్‌, తాగునీరు అందుబాటులో ఉంటుంది. శిక్షణ పొందిన విద్యార్థులు మంచి కళాశాలల్లో సీటు సంపాదించి ఉన్నతస్థాయిలో ఉన్నారు. – వాసాల ప్రభాకర్‌, కోకన్వీనర్‌, కాగజ్‌నగర్‌ ఎంఈవో

Advertisement
 
Advertisement
Advertisement