కేజీబీవీ విద్యార్థినులకు వ్యాసరచన పోటీలు | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీ విద్యార్థినులకు వ్యాసరచన పోటీలు

Apr 16 2026 11:59 AM | Updated on Apr 16 2026 11:59 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: తల్లిదండ్రులకు అవగాహ న కల్పించేందుకు ‘నాన్న మా భద్రత కోసం హెల్మెట్‌ కొని పెట్టుకోండి’ అనే అంశంపై కాగజ్‌నగర్‌ పట్టణంలోని కేజీబీవీ విద్యార్థులకు బుధవారం డీఎస్పీ వహీదుద్దీన్‌ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని హెల్మెట్‌ ధరించడంతో కలిగే ప్రయోజనాలు, రోడ్డు ప్రమాదాల నివారణలో హెల్మెట్‌ ప్రాముఖ్యత, కుటుంబ సభ్యుల భద్రతపై అభిప్రాయాలు వెల్లడించారు. డీఎస్పీ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హె ల్మెట్‌ ధరించాలని, ప్రాణరక్షణలో హెల్మెట్‌ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కేజీబీవీ ఎస్‌వో రమాదేవి, ఎస్సైలు సుధాకర్‌, రాజు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement