హిందువులు ఏకతాటిపై నడవాలి | - | Sakshi
Sakshi News home page

హిందువులు ఏకతాటిపై నడవాలి

Apr 16 2026 11:59 AM | Updated on Apr 16 2026 11:59 AM

కౌటాల: సమాజ శ్రేయస్సు, సనాతన ధర్మ రక్షణకు హిందువులందరూ ఏకతాటిపై నడవాలని మహాదేవ్‌ ధర్మ పీఠం గుడిమెట్‌ సద్గు రు మహదేవ్‌ స్వామిజీ అన్నారు. కౌటాల మినీ స్టేడియంలో బుధవారం రాత్రి హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మం కోసం బ్రిటిష్‌ పాలనలో స్వామి వివేకానంద చేసిన కృషిని అందరూ గుర్తు చేసుకోవాలన్నారు. అంతకు ముందు మండల కేంద్రంలో భారీ ర్యాలీ తీశారు. కార్యక్రమంలో హరణ్‌ఘట్‌ మహారాష్ట్ర శ్రీసంత్‌ మరళీధర్‌ మహరాజ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ తెలంగాణ సహ ప్రాంత ప్రచారక్‌ కల్వగురి ప్రభుకుమార్‌, కౌటాల సర్పంచ్‌ నక్క శంకర్‌, నిర్వాహకులు దౌలత్‌, ఎల్ములే దత్తు, ప్రభీర్‌, సత్యనారాయణ, కుంచాల విజయ్‌, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement