‘నవోదయ’లో వందశాతం ఉత్తీర్ణత | - | Sakshi
Sakshi News home page

‘నవోదయ’లో వందశాతం ఉత్తీర్ణత

Apr 16 2026 11:59 AM | Updated on Apr 16 2026 11:59 AM

● సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు విడుదల

కాగజ్‌నగర్‌టౌన్‌: సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. కాగజ్‌నగర్‌ పట్టణంలోని పీఎంశ్రీ జవహర్‌ నవోదయ విద్యాలయంలో 80 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా వందశాతం ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్‌ రేపాల కృష్ణ తెలిపారు. 600 మార్కులకు జె.ఆదిత్య 584(97శాతం), లక్ష్మి ప్రణవి 575(96.4శాతం), ఎన్‌.బబ్లు 566(96 శాతం), చప్పిడి స్నేహాల్‌ 573(95.5శాతం) మార్కులతో టాపర్లుగా నిలిచారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.

రేపు విశ్రాంత ఉద్యోగుల నిరసన

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 17న నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కర్ణాగౌడ్‌ తెలిపారు. ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టి అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. విశ్రాంత ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement