లక్ష్యాలు ఉన్నతంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

లక్ష్యాలు ఉన్నతంగా ఉండాలి

Apr 16 2026 11:59 AM | Updated on Apr 16 2026 11:59 AM

● కలెక్టర్‌ కె.హరిత

కాగజ్‌నగర్‌టౌన్‌: విద్యార్థుల లక్ష్యాలు ఉన్నతంగా ఉండాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఎమ్మార్సీ భవనంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాలిసెట్‌, తెలంగాణ సామాజిక సంక్షేమ రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల ప్రవేశ పరీక్షల ఉచిత కోచింగ్‌ శిబిరాన్ని సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధా శుక్లా, జిల్లా విద్యాధికారి లలితతో కలిసి ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకుని, క్రమశిక్షణతో ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. విద్యార్థులకు అంకితభావంతో ఉచిత కోచింగ్‌ అందించడం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్‌, జిల్లా సైన్స్‌అధికారి కటుకం మధుకర్‌, ఎంఈవో వాసాల ప్రభాకర్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్‌ అధికారి దేవాజీ, విలీన విద్య కోఆర్డి నేటర్‌ శాంతికుమారి, విషయ నిపుణులు ధర్మపురి వెంకటేశ్వర్లు, మహ్మద్‌ షాబీర్‌, దుర్గమోహన్‌, మామిడాల తిరుపతయ్య, శ్రీశైలం, రవికుమార్‌, తిరుపతి, త్రివేణి, ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, చంద్రశేఖర్‌, ఉపాధ్యాయ సంఘం నాయకులు శాంతికుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement