‘గుర్తింపు’ ఎన్నికలు నిర్వహించాలని వినతి | - | Sakshi
Sakshi News home page

‘గుర్తింపు’ ఎన్నికలు నిర్వహించాలని వినతి

Apr 16 2026 11:59 AM | Updated on Apr 16 2026 11:59 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: కాగజ్‌నగర్‌ పట్టణంలోని సిర్పూర్‌ పేపర్‌ మిల్లులో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని బుధవారం హైదరాబాద్‌లో రాష్ట్ర కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ పమేలా సత్పతికి సీఐటీయూ రాష్ట్ర కమిటీ నాయకులు వినతిపత్రం అందించారు. సిర్పూర్‌ పేపర్‌మిల్‌ మజ్దూర్‌ యూనియన్‌ అధ్యక్షుడు జె.మల్లికార్జున్‌ మాట్లాడుతూ 2018 ఆగస్టు 2న జేకే పేపర్‌ లిమిటెడ్‌ యాజమాన్యం ఎస్పీఎంను టేకోవర్‌ చేసుకుందని, 373 మంది పర్మినెంట్‌, 2,188 మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారని తెలిపారు. ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించలేదన్నారు. ఇండస్ట్రీయల్‌ రిలేషన్‌ కోడ్‌ 2020 సెక్షన్‌–14(1)టు(4) ప్రకారం డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌కు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించే పాత్ర లేదని కేసు వేసిందని పేర్కొన్నారు. అనేక పరిశ్రమల్లో పాత చట్టం ప్రకారమే ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్పీఎంలోనూ ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్‌ పేపర్‌మిల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భూపాల్‌, రాష్ట్ర కోశాధికారి రాములు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement