ఏడాదిగా నిరీక్షణ! | - | Sakshi
Sakshi News home page

ఏడాదిగా నిరీక్షణ!

Apr 16 2026 11:59 AM | Updated on Apr 16 2026 11:59 AM

జిల్లా కేంద్రానికి చెందిన అనుముల గణేశ్‌ వాంకిడి మండలంలో మూడు ప్లాట్లు కొనుగోలు చేశాడు. ఎల్‌ఆర్‌ఎస్‌ పథకంలో భాగంగా ఒక్కో ప్లాట్‌కు రూ.వెయ్యి చొప్పున చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. మూడు ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ఏడాది క్రితం రూ.43,785 చెల్లించగా, ఇప్పటివరకు ఫైనల్‌ సర్టిఫికెట్‌ జారీ కాలేదు. ఇంటి నిర్మాణం, విద్యుత్‌ కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకోగా, ఎల్‌ఆర్‌ఎస్‌ సర్టిఫికెట్‌ లేక పంచాయతీ అధికారులు అనుమతి ఇవ్వడం లేదు. వాంకిడి పంచాయతీ, డీపీవో కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు స్పందించడం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement